శ్రీనివాస
ఏడుకొండల్లోన వెలసిన
శ్రీలక్ష్మిసమేతుడ వైన
నా మొర నీవు వినవ
నా భాద నీవు ఎరగవ
నీ సేవయే నా ఊపిరి
నీ దర్శనమే నా ఆఖరి
కాలినడకన నీ కొండకి
మార్గముంటే సూపవ
వడ్డికాసుల లెక్కలేనా
లక్ష్మితోడై ఉయ్యాలలేనా…
శేష పాన్పుపై నిధురెనా
ఇరుబార్యలతో కబురులేనా….
గుండె గుడిలోన కొలువైన నిన్ను గుండె ఆగే వరకు కొలిచేదము
పంచభక్ష్యములతో ఆరాధిం చేదము
ఆదుకోవయ్యా శ్రీ శ్రీనివాస
– హనుమంత