శ్రద్ధాంజలి
నేనేందో
రాసుకుంటున్నాను
కారణాలతోనో కన్నీళ్లతోనో
అగాధపు చింతనలతోనో
బతుకు విస్తరి ఆకులను
కుట్టుకుంటూ భావాలను అల్లుకుంటూ వడ్డీంచిన విస్తరి వన భోజనంలా..,
బతుకు పూట నిర్మాణంకై
ఒక స్వప్న సూచికలా
నేనేందో రాసుకుంటున్నాను
నేనేందో రాసుకుంటున్నాను
అర్థం కాని కవిత్వమై
బతుకు పుటలో పిచ్చి గీతై
నిరాశ సరిహద్దులో పహారి కాస్తూ
ఆశ తీరాన్ని తాకి విజయ
పతంగి ఎగరేద్దామని,
విధి వైపరీత్యా ముకలతో
దైర్యం అనే ఆత్మ రక్షణ అస్త్రం
ధరించి చేదిస్తూ అక్షరజ్ఞపు
తూట పిరంగులు పేలుస్తూ
కర్మ సాధన శిక్షణలో
తర్ఫీదు పొందుతూ
తాత్విక సంచారినై పోదాం అని
నేనేందో రాసుకుంటున్నాను
కడలి అలలు లాంటి నా కన్నీళ్లకు
బాధతర్పిత హృదయంతో
ముందుమాటగా నేనేందో
రాసుకుంటున్నాను
అక్షర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను..!!
-సైదాచారి మండోజు