S.P బాల “సుస్వర “మణ్యం
*******
పాటతో..
మాటతో..
తెలుగు జాతికి అమృతాన్ని పంచిన గాన గాంధర్వుడు
సంగీతభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు…
ఆయన పాట పాడితే
పాట హృదయం పరవశిస్తుంది.
ఆయన పాట వింటే శ్రోత హృదయం పులకరిస్తుంది.
ఆయన గళం సుధామధురం
ఆయన పాడితే సమ్మోహనం
ఆయన పాట వినడం…
పూర్వజన్మ సుకృతం…
ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం.
స్వర జతుల సంగమ నిధి
సంగీత పయోనిధీ శ్రీపతి !
సంగీత జగాన పండితులకు సైతం
ఆరాధ్యుడు మన పండితారాధ్యుడు !
ఆబాల గోపాలాన్ని తన స్వరామృత ధారలతో
పునీతుడు చేసిన గానసరస్వతి బాలుడు !
సిరి సిరి మువ్వలు గా మోగే చిరు చిరు స్వరాలను
రా దిగి రా అంటూ చేసాడు కదా స్వరాభిషేకం !
శంకరుడికి ఆభరణం మెడ మీదనున్న నాగం
బాలుగారికి ఆభరణం శంకరాభరణం గానం !
మన తెలుగునేలకు దొరికిన స్వాతిముత్యం
ప్రతి మదిని మురిపించిన ఆణిముత్యం!
గానగంధర్వ సమాన సమ్మోహిత గళం
విశ్వనాధ విరచిత సుస్వర స్వర్ణకమలం !
పాడుతా తీయగా అంటూ లక్షలాది గళాలను
సరాగాలతో చేసాడు స్వర సాగర సంగమం!
పాటను, భాషను, భావాల్ని, పాటల వెనక
వారందరి శ్రమను విడమర్చి చెప్పే
బాలు గారి వివరణ శుభ సంకల్పమే !🙏🙏🙏
-గురువర్ధన్ రెడ్డి