సొట్ట బుగ్గలు!!
నడుము వంగిన
నాయనమ్మ
చక, చక లు,
మరి చెంబు నిండుగా నీళ్ళు,
ఆరు బయట వేసిన
మంచాన్ని చేర ఆరాటము.
చల్లని చీకట్లలో
నిండు వెన్నెల కాంతులు,
చెవికి తాకుతున్న చల్లని
చెట్ల గాలులు,
మనో గతంలో మెదిలిన
పెనిమిటి చిలిపి చేష్టలు,
ఆరడుగుల మనవడు
చూసు నేమో అని
దాచెను సిగ్గుల
సొట్ట బుగ్గల చాటున.
వెండి కాంతులను జిమ్మిన
పళ్ళు ఒక్కటైన మిగలక పాయె.
పండిన ఆ పండు తల్లికి మిగిలెను
నిండు వెన్నెలల ఊరటలు.
– వాసు