సొంపైన!!
నీ పాదాల అలికిడుల
వినికిడులు,
మధుర గానాలను
ఆలపించెను …….!
నీవు తట్టిన నా ద్వారము,
రాజమందిరం అయ్యే.
రాచమర్యాదలు చేయ, నేను
నీ చెలికాడి నై ఎదురైతి……!
నీ మీన నేత్రాల
వాడైనా చూపులు,
తాకి ఛిద్రమాయెను నా గుండె.
ఇది గాయము కాదు లే,
మహా గాయము లే…………!
నీ వయ్యారి నడకల
ప్రకంపనలకు,
కంపించెను నా రాజ మందిరము.
భూమి కంపించినా
నిలుచును, ఇది,
నాదైన నీ
హృదయ నివాసము………!
తనివితీరా చూసేదను
నీ చిరు మందహాసం.
అది కాదు నీ పెదాల ఒంపు ది.
దేవుడు నీకు ఇచ్చిన
సౌష్టవ సోంపు దే…………!
– వాసు