స్నేహితుల దినోత్సవం
తోడుగా నిలిచేవాడు
కల్మషం లేని వాడు
కష్టం తెలిసినవాడు
సమయానికి ఆదుకునే వాడు
పరుల కొరకు ప్రాణాలు వదిలిన వాడు
తప్పు చేయని వాడు
పెద్దల్ని గౌరవించినవాడు
కులమతాలకు అతీతుడు
మానవత్వం కలిగిన వాడు
సేవ తత్వం కలిగిన వాడు
నా దగ్గర డబ్బులు లేకపోతే
తను సహాయం చేసేవాడు వడ్డీకి కాక
నన్ను ఇతరులు నా మూసి చేస్తే చులకనగా చూడని వాడు
ఏ వ్యసనం లేని వాడు
తనకి మందు అలవాటు ఉన్న
నాకు తాగించకుండా ఉండేవాడు
అబద్దాలు పలకని వాడు
చెడు తిరుగులు తిరగని వాడు
తల్లి తండ్రి కుటుంబ పెద్దలు
బయట నాకు స్నేహితుడే దైవం
స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం
బదులు పలికేద ప్రతిక్షణం
నన్ను ఎవరైనా కొడితే ఏడ్చేవాడు
నన్ను ఎవరైనా తిడితే తిరిగి అడిగేవాడు
నాకు బట్టలు లేకపోతే కుట్టించి ఇచ్చిన వాడే
నా కష్టానికి సుఖానికి నిలువుటద్దంగా నిలిచిన వాడే
నా స్నేహితుడు నా ప్రాణం
నా కలానికి సిరా ప్రాణం
నా జీవితానికి స్నేహమే ప్రాణం
నా సమాజానికి నా సాహిత్యమే ప్రాణం
నా ఊపిరి స్నేహం
నా చివరి పిలుపు స్నేహం
-యడ్ల శ్రీనివాసరావు