స్నేహపరిమళం
ప్రయత్నిస్తే దొరకదు
ప్రతిఘటిస్తే ఉండదు
ప్రతిధ్వనించే స్వరమై
పలకరించాలంటే
హృదయం పులకించాలంటుంది
జీవితాన్ని తడిమి
వేదనలను తరిమి
వాదనలను పొదిగి
త్యాగాన్ని నిలిపే స్నేహం
నిత్యమై నిలిచేటి సత్యం
దాపరికాలొద్దని
రాచరికాలొద్దని
పరాచికమై పరవశమై
సురభిళ పరిమళమై
వ్యాపించేదే స్నేహం
మిత్రులకు మైత్రీదినోత్సవ శుభాకాంక్షలతో
– సి. యస్. రాంబాబు