స్నేహం
ఎక్కడ పుట్టమో తెలీదు.. ఎలా పెరిగమో తెలీదు.. కానీ ఒక రోజు ఇద్దరం కలిసాము.. నువ్వు నాకు పరిచయం అయిన క్షణం నుండి ఈ రోజు వరకు… నా వెన్నంటే ఉండి నాకు అన్ని విధాలుగా అన్ని వేళలా మంచి, చెడులో నాకు తోడుగా ఉన్నావు.. ఇలాగే ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి.. నన్ను విడిచి వెళ్ళకూడదు.. అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
ఏ స్వార్దం లేకుండా.. ఏ రక్త బంధం లేకుండా.. మన మంచి కోరుకునేది ఓకే ఒక్క బంధం స్నేహ బంధం.. అలాంటి బంధం దొరికితే ఎవరైనా అదృష్ట వంతులే.. మనల్ని కన్న వారితో కూడా అన్ని పంచుకొలేము.. తోడ పుట్టిన వాళ్ళతో అన్ని చెప్పుకోలేని… కానీ మన జీవితంలోకి వచ్చే స్నేహితులకి మాత్రం అన్ని పంచుకుంటాం… అదే స్నేహం యొక్క గొప్ప తనము..
కానీ ఇలాంటి స్నేహాన్ని.. కొందరు స్వార్దం కోసం ఉపయోగించుకుంటున్నారు.. అవసరాల కోసం వాడుకుంటున్నారు… స్వార్దం ముసుగులో స్నేహానికి కూడ బ్రష్టు పట్టిస్తున్నారు.. స్నేహం ఒక గొప్ప వరం లాంటిది.. నిజమైన స్నేహం అందరికీ దొరకదు.. దయచేసి ఇలాంటి స్నేహాన్ని అవసరాలకు, వ్యసనాలకు, మీ స్వార్ధానికి ఉపయోగించుకొవద్దు..
– వనీత రెడ్డీ