స్నేహ పవనం

స్నేహ పవనం

 

మా ముగ్గురు మిత్రుల

(సూర్యుడు, సాగరం, సంధ్య)

స్నేహ పవనం.. నా ఈ కవనం..

“మన మంతనాలు

నా మనసుకు మంత్రాలు..

మన సంభాషణలు నా

భావాలకు భూషణలు..

ఈ దాగుడుమూతలు

మన మూగ మనసుల బాసలు..

నువ్వు ప్రేమ సాగరమైతే..

నేను అందులో కేరింతలు కొట్టే మూగజీవాన్ని.

నువ్వు అనురాగ సూర్యుడివైతే..

నేను నీ కాంతితో ప్రకాశించే సంధ్యా కాలాన్ని.

ఈ భూమ్యాకాశాలు ఉన్నంత

వరకు మనం విడదీయడానికి వీలులేని ఆప్తమిత్రులం.”

 

-శంభుని సంధ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *