సీతారాముల ప్రేమ
తండ్రి దశరధుని మాట పాటించి రాముడు తన తమ్ముడు లక్మణునితో, భార్య సీతాదేవితో కలిసి అయోధ్యా నగరం నుండి అడవికి బయలుదేరి వెళుతుండగా సీతాదేవి శ్రీరామునితో”నాధా,
మనము ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. పర్ణ కుటీరం ఎక్కడ
ఏర్పాటు చేస్తున్నారు”అని అడిగింది. సీతాదేవి నుదుటి
నుండి చెమట ధారాపాతంగా
కారుతోంది. ఎంతయినా సీత
రాజకుమారి కదా. వదినకు
త్రాగే నీరు తేవటానికి లక్మణుడు అడవిలో ఉన్న
సరోవరం దగ్గరకు వెళ్ళాడు.
సీత పరిస్థితి చూసి రాముని
కళ్ళలో కన్నీరు నిలిచింది.
శ్రీ రాముడు సీతాదేవి పాదాలకు గుచ్చుకున్న
ముళ్ళను తన చేతులతో
తీసి ఆ పాదాలను నిమిరాడు.
సీతాదేవి తన పతికి తన పట్ల
ఉన్న ప్రేమకు పులకించిపోయింది. నిజంగా వారు ఆదర్శ దంపతులు.
-వెంకట భాను ప్రసాద్
సీతారాములు ఆదర్శ దంపతులు.