సినారె గారికి… నివాళి🙏
కలం కదిలితే కమనీయ కవిత.. చిలికించిన సినారె
గళం పలికితే తీయ తేనియత.. కురిపించిన సినారె
కావ్యసుమా లల్లినాడు.. మానవత పరిమళం పంచినాడు.
కవిత పదములకు లయాత్మకత.. నేర్పించిన సినారె
ఋతుచక్రం సుమధుర కావ్యం.. గెలిచింది రాష్ట్ర పురస్కారం.
ఆరు ఋతువుల గమనాన్ని వర్ణించి.. అలరించిన సినారె
మంటలూ, మానవుడు కావ్యం.. అందుకుంది కేంద్ర పురస్కారం
సగటు మానవుని జీవిత గమనాన్ని… చిత్రించిన సినారె
విశ్వంభరా కావ్యం సృష్టించి... జ్ఞానపీఠాన్ని అధిష్టించినవాడు
తెలుగు వచనకవితకి ఘనకీర్తిని… అందించిన సినారె
తెలుగుసాహితికి ప్రపంచపదులను.. మానవీయ గజళ్ళలను
అందించినాడు ఆలాపించి… మురిపించిన సినారె
సినీగీతాలు రచించినాడు… హృదయాలను దోచుకున్నాడు
ఇగిరిపోని గంధమంటి పాటలను… సృష్టించిన సినారె….
-గురువర్ధన్ రెడ్డి