శ్వాస
నీ శ్వాస నీ ఊపరిలో
నిండి ఉన్నది
వుచ్వాస నిచ్వాసాల సారమే పుట్టుక రహస్యం
శ్వాసే ప్రాణం యానం
శ్వాసే శక్తి చేవ
శ్వాస నే నీ స్పందన
శ్వాస నే అడుగు గడువు
శ్వాస నే ఉలుకు పలుకు
శ్వాస నే నిలువు నీడ
శ్వాస నే రూపం రుణం
శ్వాస నే నువ్వు నేను
శ్వాస నే ఆరోగ్యం ఆనందం
శ్వాస నే సంఘర్షణ
అలుపెరగని హృదయానికి
మరణం ఒక శరణ్యం
అదే సృష్టి నీ. కిచ్చిన
అద్భుత యోగం …
– జి జయ