శుభ కృత్ నామ సంవత్సరాది ఉగాది
10-04-22 సమయం 12:గం నవమి
శ్రీ రాముని కళ్యాణ వైభోగం కన్నులకు కనువిందుగా కారణ పురుషుడు,
నారాయణుడు అండ పిండ బ్రహ్మండ నాయకుడైన తల్లిదండ్రులకు వర పుత్రుడైన శ్రీ రామచంద్రుడు పుత్ర కామేష్ఠి యజ్ఞ పవిత్రుడు.
అన్న దమ్ములకు ఆదర్శ పురుషుడు
రాజులకు సమ ధర్మ పరివర్తకుడు.
దేవతలచే దివ్య ఆశీస్సులు పొందినటు వంటి వాడు.
గురువుల ద్వారా రాజ ధర్మం నెరిగినవాడు.
ప్రజలకు సుపరిపాలన అందించాడు.
శ్రీ సీత సమేత ఏక పత్నీవ్రతుడు
దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలకుడు
సుగుణాభి రాముడు, భార్గవ రాముడు,జగదాభి రాముడు
రఘుకుల సోముడు
భవనాశ రాముడు
రఘు వంశనికే కీర్తి ప్రతిష్టలను దెచ్చిన సమ దృష్టి రాముడు
ద్వాదశి కళలచే ధైర్య సహసాల గుణాదాభి రాముడు
తన పరిపాలన ని తానే పరిక్షించే వాడు.
తనని తానే శిక్షించుకునే వాడు.
ఏడెడు పద్నాలుగు భవనములలో అరణ్య అజ్ఞాతవాసం ఆకులు, అలములు, కందములదులను అన్న హారాలుగా భుజించినటువంటి వాడు
భువన భండములను పరిపాలించిన భువణేషుడు. భుజశాలి
భద్రాద్రి యందున భజింపబడిన భద్రాద్రి రాముడు.
నవ ద్వారాముల యందున విలక్షణ శ్రీ రామచంద్రుడు ఆద్యాత్మికంగా విచారిస్తే
కైలాస వాసుని నివాసడైన శ్రీ మాన్నారాయణుడే శ్రీ రాముని గా
శ్రీ మాన్నారాయణుని హృదయ పద్మం నందు నివసించిన శ్రీ మహాలక్ష్మి దేవి
ఏ సీత
ఏడు పడగల నాగ అది శేషుడే లక్మణుడె
వైకుంఠుని శంకు చక్రాలే భరతశత్రజ్ఞులుగా
కాల రుద్రువతారం అయిన ఆంజనేయుడు కపీవరుడు
కారణ పురుషుడు.
సృష్టికి ప్రతి సృష్టి గావించు వాడే విశ్వామిత్రుడు విలువిద్య పారంగతులుగా పరీక్షించి వీరికి అస్త్ర శస్త్ర ఆయురారోగ్యా విజేతలు గా ప్రకటించి తన యజ్ఞ యాగ క్రతువు లను భంగ పరిచే
లోక కంఠకులను తాటకి, మారిచ సుభహులను, యమధర్మరాజు అయిన కాల పురుషుని ధర్మానికి అప్పగించి రావణ కుంభకర్ణ
మరేందరినో చీల్చి చెండాడి సుగుణాభి రాముడు అయ్యాడు.
ఇట్టి మహా పుణ్య పురుషుని కథలు,చరిత్రలు వాల్మీకి మహర్షి కథలుగా ,చరిత్రలో ఋషులు, మునులు,ప్రజలు, విని భజించి,పారాయణం చేసి పవిత్రులు అయినారు
పరమ పదవులు పొందినారు.
అందరికీ శ్రీ రామ నవమి మరియు
శ్రీ శుభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు…
– శివరాం శంకర్ నాయుడు