శుభ హరిణి
జనని శివకామిని జయశుభ హారిణి.. హృదయ రూపిణీ… జనని.. శివకామిని.. జయ శుభహారిణి హృదయ రూపిణీ… అమ్మలగన్నా అమ్మవు నీవు, అమ్మలగన్నా అమ్మవు నీవు,
నీ చరణములే నమ్మితినమ్మా, వరములీయవే ,అమ్మ భవాని, జననీ శివకామిని జయ శుభ హారిని హృదయ రూపిణీ.
నీ దయనున్న కలుగు జయాలు, నీ దయనున్న తోలుగు భయాలు,నిరతము నిన్నే నమ్మితినమ్మ, వరములీయవే అమ్మ భవాని…
జనని… శివకామిని…. జయ శుభ హారిణి… హృదయ రూపిని జననీ శివకామిని..
అమ్మలగమ్మ, అమ్మలగన్నయమ్మ, ఆ మూలపుటమ్మ ,అన్నీ తెలిసిన అమ్మ, అందరిని తన కరుణా వీక్షణాలతో ,అందరి బాధలు తీరుస్తూ, జయాలు ,భయాలు కలగనీయకుండా చూసే శక్తి స్వరూపిణి. ఆమె లీలలు ఆన్నో ఎన్నో కావు.
ఎప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆమెకు మాత్రమే తెలుసు. ఇది నా అనుభవంతో చెప్తున్నా మాట.
కొన్ని నేల్ల క్రితం అమ్మ నాకు పరీక్ష పెట్టింది.
ఆ పరీక్షను నేను చాలా వరకు గుర్తించలేకపోయాను. గుర్తించిన తర్వాత అమ్మ నువ్వే దిక్కు. అని ఆమెకు కావాల్సిన మొక్కులన్నీ తీర్చగలిగాను.
తీర్చిన పది రోజుల తర్వాత అమ్మ నన్ను కరుణించింది నా సమస్య తీరిపోయింది. ఇక్కడ అమ్మ అంటే శక్తి స్వరూపిణి దేవతే అని కాదు. ప్రతి ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగాడే ఆడపిల్ల కూడా ఒక శక్తి స్వరూపిణి.
ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల సంతోషంగా ఉంటే, ఆ ఇల్లు స్వర్గంతో సమానం. ఆడపిల్ల కంట కన్నీరు కారితే ఆ ఇల్లు నరకప్రాయమే అని అందరికీ తెలుసు.
అందుకే పెద్దలు అన్నారు కలకంట కన్నీరోలికితే ఆ ఇల్లు స్మశానంతో సమానమని.
భర్త తెచ్చిన డబ్బుతోనే ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నింపే అన్నపూర్ణ.బాల్యంలో ఇంట్లో వాళ్ళందరినీ తన చేష్టలతో నవ్వించే బాలా త్రిపుర సుందరి.
ఎవరికి ఏ కాస్త ఆరోగ్యం బాగా లేకపోయినా తను తెల్లార్లు మేలుకొని ఉండి వారిని కాపాడుకునే దేవత.అటు ఇంటిని చూసుకుంటూ ఇటు భర్తకు చేదోడు వాదోడుగా ఉద్యోగం చేస్తూ లక్ష్మీదేవి అనిపించుకుంటుంది.
పిల్లలకు పాఠాలు చెబుతూ సందేహాలు తీరుస్తూ సరస్వతీ దేవిగా మారుతుంది.కోపం వస్తే కాళీకలా మారి చీల్చి చెండాడుతుంది.
తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఎదురు తిరిగి పోరాడుతుంది. తాను తిన్న తినకపోయినా పిల్లలకు భర్తకు కమ్మగా వండి పెడుతుంది.
తన ఒంట్లో నలతగా ఉన్నా కూడా ఎవరికీ చెప్పకుండా తనలో తానే దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ మహాలక్ష్మిలా ఉంటుంది.
ఇన్ని చేస్తున్నా ఆడవాళ్లు అందరూ శక్తి స్వరూపిణి లే, మన భారతదేశంలో ప్రతి నదికి, ప్రతి గుడికి అమ్మవారి పేరు తప్ప మరో పేరు పెట్టరు. అంటే అతిశయోక్తి కాదు. అంటే మనం ఆడవాళ్ళని అంత గొప్పగా పూజిస్తున్నాం..
ఇంతలా పూజిస్తున్న ఆడవారికి కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టాలు తప్పడం లేదు. దానికి మనం ఏమీ చేయలేం, అని అనుకోకుండా ఏదో ఒక పరిష్కార మార్గం కనుగొనాలి. ప్రతి మహిళ తన శక్తిని తాను నిరూపించుకోగలిగినప్పుడే విజయం వైపు అడుగులు వేస్తున్నట్లు..
-భవ్యచారు