శూన్యత
అది నీ వాంఛ కాదా!
నిన్ను సుఖాలకి
తలవొగ్గి స్తున్నది.
అది నీ ఆశ కాదా!
బరువైన నీ కళ్ళ
అస్తవ్యస్త పరిస్థితికి!
ఎందుకు నీ చూపులు
రెట్టించు తావు!!
నిలువరించు వాటిని!
చూడమాకు
విశాలంగా ఆగుపిస్తున్న
ఆస్తుల వంక!
చూడుము నిండైన
దైవ కాంతిని
శూన్యములో…!
– వాసు
Awesome vasu garu
థాంక్స్ శృతి garu