శివ లీల

శివలీల

శివయ్య నీ లీలలకు సాటెవరయ్య
నీ నామ మంత్రం జపించినా చాలు
కైలాసం దిగి క్రిందికి వస్తావు,
మనస్ఫూర్తిగా నిన్ను అడిగినా చాలు

కోరిన కోర్కెలు తీర్చుతుంటావు.
భక్తుల కర్మఫల బాధలను చూసి
నీలోనే నువ్వు బాధపడుతుంటావు,
కోరిన కోర్కెలు జరగలేదని

భక్తులు నిందలు

సైతం చిరునవ్వుతో స్వీకరిస్తావు.

పరమశివుడు ఎప్పుడూ

మనతోనే ఉంటాడు,

మనం కోరుకున్న కోర్కెలు

జరగలేదంటే ఆ భగవంతుడు

మన మంచి కోసమే రాశాడని

మనం అర్థం చేసుకోవాలి,

ఆ సమయానికి మనం

తెలుసుకోలేకపోవచ్చు,

కానీ కాలం వాటికి

సమాధానం చెబుతుంది,
దుఃఖంలో ఉండే మన బాధలను

చూసి నీలకంఠుడు కూడా బాధను

దిగమింగుకుంటాడు,

మనకి జీవితంలో ఏదైతే కావాలో

మనం అడగకుండానే ఇచ్చి వెళ్తాడు,

ఆపదలో ఉండే ప్రతి భక్తునికి తోడుగా

ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు.

భగవంతుడు నిర్మించిన ఈ సృష్టిలో

మనుషులుగా జన్మించిన మనం

అతనిపై నమ్మకం ఉంచి ముందుకు సాగటమే మన కర్తవ్యం🙏

 

– కోటేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *