శరణమై
నీపాదాలే శరణమయా!!!
అయోధ్య రామయ్య
సాకేత సార్వభౌముడవయా…
నాలుగు పాదాల నిజధర్మ స్వరూపుడవు
మనస్సు చేసినా వాడివి ఆంతరమున
చిత్తాన్ని ఏకంచేసి…ప్రకృతి చేతనగా
నడిపించేటి కలాలు రాసిన కావ్వము
నీదేనయా….శ్రీరామ….
నిఖిలము నీవై…నీలోని సహనము
మము నడిపించిన సదాచారానికి
మూలమై…ఆది పురుషుడవై అవని
ధర్మాలకు నిలయమైనావు…
నింగి నొదలిన అందాల జాబిలిని అద్దాన
చూచి…ఉప్పొంగినా మనస్సున ఎన్నో
అవతారాలకు నిలయమై నిలిచావయా…
శ్రీరామ…
ధర్మపక్షమై నిలిచిన నియమాల నిష్టకు
ఆచరణా యోగ్యమై… దుష్టశిక్షణ
శిష్టరక్షణ గావిస్తు పితృవాక్య పరిపాలనతో
నీతన్నది నాలుక దాటని హద్దని…హద్ధు
దాటినా దశ కంఠుణ్ణి తుంచి నడిచినా
అడుగులతో రాతిని నాతిగా చేసిన
అవతార రూపుడవయా…శ్రీరామ…
మనస్సునా ద్వేషాలు మహిమలు
రూపం కాలేవని…బతికినా మానవత్వం
మనిషిలోని ప్రేమని చూపాలని…
మసిబూసుకొన్న చీకటి సుడిగుండాలకు
ఎదను నిలుపుతు సమేతుడవై నడిచిన
పయనం తలచినా భక్తులకు అభయమిస్తు
ఓదార్పునకు నీపాదాలే శరణమై
నిలిచేనయా….శ్రీరామ..
-దేరంగుల భైరవ