శారదా దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
ఆ.వె.)
అక్షరలిపి మూలటమ్మ శారదదేవి
పుట్టెనీదినమున పుణ్యవశము
దేవతగణమంత దివినుండి దీవించె
అమితమైన శుభము లందజేసి
తే.గీ.)
ఆయురారోగ్య మైశ్వర్య యశములంది
విద్య బుద్ధులు సాధించి విశ్వమందు
మాతృ భూమికి మీ సేవ మరువకుండ
సకల శక్తులు పొందు మా శారదాంబ
– కోట