.
షడ్రుచుల సారం
వసంతం లో వచ్చింది నూతన సంవత్సర ఉగాది
తీపి,ఉప్పు,కారం,చేదు,పులుపు,వగరు అనే ఆరు రుచులను తెచ్చే ఉగాది
చైత్రా శుద్ధ పాడ్య రోజున వస్తున్న ఉగాది
కుహు కుహు అంటూ కోయిల గానాలు
అందమైన పకృతి లో పచ్చదనాలు
కొత్త చిగురులు తొడిగే చెట్లు
వసంత గమనపు సంకేతాలు
లేత మామిడి పుతాలతో
మామిడాకుల పచ్చని తోరణలు గుమ్మానికి కట్టి
సంస్కృతి,సంప్రదాయాలను ఒకటిగా చేసి
కొత్త సృష్టి ప్రారంభం అయిన రోజు
నూతన రోజులను స్వాగతం పలుకుతూ
ప్రకృతి తెచ్చినా ఉగాది
నూతన పంచాంగం తెచ్చిన ఉగాది
బ్రహ్మ సృష్టికి ఉపక్రమణారంభ దినం
తెల్లవారి జామున అభ్యంగనాస్నానం
నూతన వస్త్రాల ధారణం
చంద్రమానం పాటించే తెలుగు జాతి
కిది సంవత్సరాది
మానవాళిజీవితంలోఎదురయ్యే
కుంకుమార్చనతో..మహిళలు పొందే అమ్మవారిసుమంగళి ఆశీస్సులు
కష్ట సుఖాలను ఒకటిగా స్వీకరించే ఆనవాళ్లు
మంచి,చెడుని సమానంగా స్వీకరించాలి
అని చెప్పే ఉగాది..
జీవితం షడ్రుచులసారంగా ఉండేటట్లు తిరిగి చేయడానికి వస్తున్న శుభోకృత్ ఉగాది
-సాహు సంధ్య