శాడిజం అంటే ఇదేనేమో
బండ బారిన గుండె కఠిన శిల
దానికేమి తెలుసు ప్రేమ,
అనుబంధాలు,ఆప్యాయతలు
ప్రకృతి పలకరింపులు,
ఎదుటివారి జీవితపు కష్టనష్టాలు,
సుఖసంతోషాలు.
మోడువారిన చెట్టుఎంతో
హృదయం లేని మనిషి కూడా అంతే
అటువంటి వారి సాహచర్యం నరకప్రాయమైనదే.
అంతమూర్ఖత్వం ఉన్న వారి హృదయం పాషాణమే.
వారు సుఖపడలేరు,
ఎదుటివారిని సుఖపడనివ్వరు.
వారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు.
ఇది ఒకరకమైన శాడిజం అనవచ్చునేమో.
–రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి