సెలవు రోజు
రాణి ఒక గృహిణి మాత్రమే కాదు కష్టపడి పని చేసే ఉద్యోగస్తురాలు కూడా. రోజు ఉదయానే లేచి వంట పని ఇంటి పని చేసి పిల్లల్ని స్కూల్ కి ,తన భర్తని ఆఫీస్ కి ,అన్ని సిదం చేసి పంపించి తాను కూడా రెడీ అయ్యి తాను ఆఫీస్ కి వెళ్లిపోయేది,తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేసి, ఇంటికొచిన్న పిల్లలు తినడానికి వాళ్లకి కావల్సినవి చేసి ,వారికీ స్నానం చేయించి, వాళ్ళ యూనిఫార్మ్స్ బట్టలు అన్ని ఉతికి ఆరేసి, ముందు రోజు ఉతికిన బట్టలు సర్ది, పిల్లలికి చదువు చెప్పి మళ్ళి వంట చేసి తన భర్త వచ్చే సమయానికికాదు, అన్ని సిద్ధం చేసి, తన తన భర్త పిల్లలికి ఏ లోటు రాకుండా చూసుకునే ఒక సాధారణ గృహిణి.
వారమంతా కష్టపడ్డా ఒక్క ఆదివారం రోజు వారం రోజుల అలసటను తీర్చుకునేంత విశ్రాంతి కోసం ఎదురుచూసేది.
ప్రతి ఆదివారం ఇక ముందులా ఉండదు, ఈ ఆదివారం కొంచెం అయినా విశ్రాంతి దొరుకుంది అనుకున్న ప్రతిసారి నిరాశే సెలవు రోజు కూడా ఎప్పటిలాగే కష్టపడుతూనే ముగిసింది అనుకుంటూ చీకటి పడిన తరువాత నిద్రపోయింది. అలా అనుకుంటూనే ప్రతి ఆదివారం గడిచిపోయేది వచ్చే ఆదివారం అయినా విశ్రాంతి వస్తుంది ఆశపడుతూ అల 10 సంవత్సరాలు గడిపేసింది.
సెలవు రోజు తన ద్రుష్టి లో వీలు లేని రోజు
– భవానీ