సయోధ్యమంత్రం

సయోధ్యమంత్రం

రాత్రి అస్పష్టతను కడిగేసే
కప్పు టీ మార్నింగ్ మార్గదర్శి

వేకువ అందాలకు
వేడి టీ వెలుగురాజేసే నిప్పు

చేసిన తప్పులను మిత్రునితో పంచుకునే
అవకాశాన్ని అడిగేందుకు కప్పు టీ
గొప్ప డిప్లొమాట్

వాదనలన్నీ వేడెక్కితే
లాజిక్లన్నీ అటకెక్కితే
సయోధ్యమంత్రాన్ని పఠించి రాజీకుదిర్చేదే
కప్పు టీ

మిత్రులందరికీ శుభోదయం

-సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *