సత్యమిదే
జీవితం రంగుల మయం కావాలని ఎవరికుండదు
మెరిసే రంగులు విరిసే పూలలా ఆహ్లాదాన్ని పంచాలంటే ఆలోచనలు వాడిపోకూడదు
నిరాశల బాటలో నడవకూడదు!
జీవితమో కూడలిలో ఉన్నప్పుడు కడలికున్నంత గాంభీర్యం కావాలి
కలయో వైష్ణవమాయయో అని సంబరపడుతుంటాం గుర్తుందా
ఆ క్షణాలను పోగేసుకునేందుకు మనసుకు శిక్షణ ఇవ్వాలి!
దారంతా రాయీరప్ప రాతను లిఖించాలని తహతహలాడుతుంటాయి
తొలగించే శక్తివి నీవయినప్పుడు
జీవితం రంగులమయం కాకతప్పదు
రంగుల విల్లు బోధించే సత్యమిదే!
– సి.యస్.రాంబాబు