సరిచేసేదెవ్వరు!
నిజాల నీడల్లా నల్ల మబ్బులు
భయంగొలుపుతుంటాయి
చినుకు తడిపిన నేలేమో
చిలిపిగా నవ్వుతుంటుంది
జీవితమూ అంతే
నిరాశలోంచి ఆశను మొలిపిస్తుంది
చిక్కుముడులు వేస్తుంది
ఏడిపించి మరీ విప్పదీస్తుంది
అంతేకదా అనుకుంటుంటే
దూరంగా వినిపిస్తుంటాయి
ఆకలి ప్రపంచం ఆర్తనాదాలు
జాలిగా చూసే నిరాశల నీలి నీడలు
సమతుల్యం లేక ప్రకృతి
సమభావన లేక మనిషి
ప్రమాదంలో పడిన వేళ
విధ్వంసాల లోయనుంచి
లాగేదెవ్వరు! సరిచేసేదెవ్వరు!
– సి. యస్. రాంబాబు