సంతృప్తి
సంతృప్తి అంటే బంగారు గని కాదు అది?
మనిషి మనసులోని
చిక్కుముడి
అది విప్పితే దొరుకుతుంది
వెచ్చించిన యోగం!
అహం వీడితే అదృష్టం
వాస్తవం ఎరిగితే సరితూచే
సంతృప్తి !
భోగాన్ని వీడితే సంతృప్తి !
సమస్యను స్వీకరిస్తే సంతృప్తి!
అవధులు లేని సంతోషాన్ని
అదుపు చేస్తే సంతృప్తి!
మది నచ్చిన పనితో
కలిగేదిఅంతులేనిసంతృప్తి!
మాట వినని మనసుకు
కళ్ళెం వేస్తే కలిగేదిసంతృప్తి !
కోరికల చిట్టానుపక్కనపెడితే
కలిగే ప్రయోజనం సంతృప్తి
దిగులు వదిలితే
భయం వీడితే సంతృప్తి!
అద్భుతాల ఆవిష్కరణకన్నా
అంతరంతంగపు శుద్ది
అసలైనసంతృప్తి!
ఆశించని సుగుణం ఉన్నా
సర్దుకునే అలవాటుఉన్నా
సరిపోయే సంతృప్తి !
అనుభవించే అవకాశం
కోసం నిరీక్షణ లేకుండా
వర్తమానపు సంతోషాన్ని
ఆస్వాదిస్తే అంతకు మించిన సంతృప్తి!
ఉన్నచోటుని చేసే పనిని
ఆరాధిస్తే సకలం సంతృప్తి!
మనసు నిష్కల్మషంగా
వుంచితే శ్రద్ధా, భక్తులతో
నింపితే ఆనందాల సంతృప్తి!
మానవ సహజమైన విషయాలే అయినా
నిత్య సత్యాన్ని చేర గలిగితే
పరవశించే అనుభూతుల
స్వర్గమే అసలైన సంతృప్తి!
అంతా మన మంచికే అనుకుంటే అది ఆశ్చర్య
కరమైన సంతృప్తి !
– జి జయ