సంతోషమే మన మిత్రుడు
సంతోషమే మన మితృడు.
దుఃఖమే కదా మన శతృవు.
మితృడితో ఉంటే సంతోషమే.
ఒంటరిగా ఉంటే అది దుఃఖమే.
ఒంటరితనం దూరం చేసుకో.
మీ సంతోషాన్ని ఆహ్వానించు.
కలసి ఉంటేనే మనకు సుఖం.
ఆ సత్యాన్ని గ్రహించకపోతే
ఒనగూడేది నిరంతర దుఃఖమే.
తన సంతోషానికి పనిచేయటం
స్వార్థం అనిపించుకుంటుంది.
అందరి సంతోషానికై పనిచేస్తే
అది మీకే సంతృప్తిని ఇస్తుంది.
-వెంకట భాను ప్రసాద్ చలసాని