సన్మానం
ఉత్తమ శ్రీ పతివాడ నారాయణరావు మాస్టర్ గారికి రావివలస నుండి డీకే పత్తి గ్రామానికి బదిలీ అయిన సందర్భంగా ఘనంగా సన్మానం పాఠశాల అభివృద్ధికి పతివాడ నారాయణరావు మాస్టారు చేసిన కృషి అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి ఎస్ వెంకట్రావు అన్నారు.
ఈరోజు గంట్యాడ మండలం రావివలస మండల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పతివాడ నారాయణరావుమాస్టారుకు పౌర సన్మానం చేపట్టడం అభినందనీయమని అన్నారు.
తొమ్మిది సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తూ 6000/- రూపాయలతో స్వంత నిధులతో గ్రామ పెద్దల సహకారంతో భవనానికి మరమత్తులు చేయడం.
మొక్కలు నాటడం పిల్లలకు కావలసిన పుస్తకాలు పెన్నులు పంపిణీలో ఆయన చేసిన కృషికి గ్రామ పెద్దలు, అమ్మ ట్రస్ట్ సభ్యులు అలాగే సాయి కృష్ణ వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్య కమిటీ సభ్యులందరూ పౌర సన్మానం చేయడం పూర్వజన్మ సుకృతం అని ఇందరి అభిమానాన్ని పొందిన మాస్టారు అక్కడ కూడా ఇలాగే అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
గ్రామ సర్పంచ్ అర్.సత్యవతి మాట్లాడుతూ పాఠశాలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మాస్టారు ఆ విషయం తెలిపేవారని పిల్లలపై ఎక్కువ శ్రద్ధ కనబరిచే వారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిరిపురపు రాము గంట అప్పల సత్యం అమ్మ స్వచ్చంద సంస్థ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ శ్రీను రంగవల్లి సత్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
-యడ్ల శ్రీనివాస్ రావు
బాగుంది..