సంక్రాంతి సంబరం
సంకురుడు వచ్చెను, సంక్రాంతిని తెచ్చెను.
మగువలు ముగ్గులతో ముంగిళ్ళను నింపెను.
ముచ్చటగా గొబ్బెమ్మలను పేర్చేను.
కూడలిలో భోగి మంటలు వెలిగించెను,
ఇంటిలోని పిల్లలు అవుపిడకల
హరం ధరింపచేసెను.
ఆనాడు నెయ్యి, బెల్లం, పచ్చి పులుసులతో
పులగన్నం ఆరగించేను.
పెద్దపండగనాడే, పెద్దలు వచ్చెను,
అమ్మలు, పెద్దమ్మలు పేరంటము పెట్టును.
పప్పు, గారెలు వడ్డించేను.
కనుమ రోజున కోడి నైవేద్యమయ్యేను.
బూరెలతో బుట్ట నిండిపోవును.
అయినవారితో ఇళ్ళు కళకళలాడేను.
కొత్త అల్లుళ్లతో, దేవుని ఉరేగింపులతో,
పిల్లల ఆటపాటలతో, హరిదాసుల రాగాలతో,
గంగిరెద్దుల మేళాలతో ఊరంతా సంబరమయ్యేను.
సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని, అందాన్ని తెచ్చెను.
అందరి మనసులు మురిసేను.
-బి. రాధిక
కళ్లకు కట్టినట్లు అక్షరీకరించారు .. మీకు అభినందనలు…💐💐💐💐💐💐