సంఘర్షణ
ఇష్టమని కాదు కానీ
కష్టమైనప్పుడు అబద్ధాన్ని చెప్పాను.
కలలు కనలేదని అనను కానీ
నిజంలో బ్రతకలేనప్పుడు వాటిని ఆశ్రయిస్తాను.
మోసం చేయలేదు అనను కానీ
మోసపోయే స్థితులు అనుభవించి నన్ను
నేను మోసం చేసుకోవడం అలవాటు చేసుకున్నాను.
దొంగతనం చేయలేదు అనను కానీ
దొంగిలించబడిన మనసుల్ని వదిలివేశాను.
నేను పక్కా నిజాన్ని అని చెప్పను కానీ
నిజంలా అనిపించే అబద్ధాన్ని
నీలో నిత్యం జరిగే సంఘర్షణను
– భరద్వాజ్