సమిష్టి కుటుంబాలు
అంతర్ముఖులను మామూలుమనుషులుగా చెయ్యవచ్చు.పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. సమిష్టి కుటుంబాలలోఅందరూ కలిసి ఉండేవారు.
ఎవరైనా ఒంటరిగాఉన్నా,మాట్లాడక పోయినాపెద్దలు వారితో మాట్లాడివారిని అందరితో కలిపేప్రయత్నం చేసేవారు.
కుటుంబంలో ఎవరయినానిరుత్సాహంగా కనిపించినావారితో మాట్లాడి వారి మనసులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసేవారు.
ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు. అందరూ బిజీగా ఉంటున్నారు. పిల్లలను పట్టించుకునేవారే లేరు. దానివలన పిల్లలుఅంతర్ముఖులుగా మారిపోతూ ఉన్నారు.
అది చాలా ప్రమాదం.వారు తమ భావాలను ఎవరితోనూ పంచుకోరు. ఎవరితో కలవరు. ఒంటరిగాఉంటారు.
నిదానంగా డిప్రెషన్లోకి జారుకుంటారు.చివరకు ఆత్మహత్యలుచేసుకునే స్ధితికి వస్తారు. అలాంటి వారికి తొందరగాకౌన్సెలింగ్ ఇచ్చి మామూలుమనుషులుగా చెయ్యవచ్చు.తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని