సమయం
సమయం ఎంతో విలువైనది..
సమయాన్ని ఎప్పుడు దుర్వియోగం చేసుకుడదు..
సమయానికి అన్ని పనులు చేయడం వల్ల ఒక బాధ్యతగా భావిస్తారు..
కుటుంబానికి కూడా మన సమయం ఇవ్వాలి..
సమయం ఉన్నప్పుడే జీవితంలో ప్రతి రోజు
జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి…
సమయం కోల్పోయినప్పుడై దాన్ని విలువ తెలుస్తుంది..
ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రానిది సమయం
దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించుకోవాలి..
సరైన సమయంలో నిజం చెప్పలేని పరిస్ధితిలో
అబద్ధం కన్నా ఎక్కువ నష్టం కలుస్తుంది…
సమయం ఉన్నప్పుడు గడిపిన రోజులు కంటే
సమయం కల్పించుకొని గడిపిన రోజులే మంచివి…
మీ సమయాన్ని నిన్నటి సమస్యల మీద దృష్టి పెట్టకండి..
- మాధవి కాళ్ల