సమయం
సమయం ఎవరి కోసమూ ఆగని కాలప్రవాహం
గడిచిన సమయం
జారినమాట తిరిగి తేలేనిది
సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్లే గొప్పవాళ్లు
విలువైన సమయాన్ని విలక్షణ రీతిలో వాడితే గొప్ప ఫలితాలు వస్తాయి
కదిలే సమయాన్ని ఆపలేము కానీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు
సమయాన్ని ప్రణాళిక వేస్తే భవిష్యత్తు బహు ప్రయోజన
కారిగా మారుతుంది
ఒక్క క్షణంలో కూడా ఊహించని మార్పులు జరగవచ్చు
మనం చూసే మహానుభావులందరూ సమయపాలన రహస్యమే
వారి విజయాల బాటలు
సమయం ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుంది శక్తిని నింపుతుంది
కొన్ని సమయాల్లో సమయమే ఊరట కొన్ని సమయాల్లో సమయమే పరిష్కారం
సమయమే విశ్వాసం
ఏది ఏమైనా సమయాన్ని సద్వినియోగ పరచిన వాళ్లకే సమస్యలు తక్కువ అంటారు
జీవితాన్నిసమయానుకూలంగా
సరితూచుకొని తీర్చిదిద్దుకోవడమే మన ముందున్న లక్ష్యం మరి….
– జి జయ