సమయం
సమయం చాలా విలువైనది, దాన్ని వృధా చేయడం అంటే మనం మనల్ని మనం కించపరచుకున్నట్టే, లేదా కాలాన్ని వెనక్కి మరల్చినట్టే, మనం కాలాన్ని, అంటే సమయాన్ని ఫోన్ లతోనూ, స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం లోనూ వృధా చేస్తూ, సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా, సమయం అయిపోయాక అయ్యో అని బాధ పడుతూ ఉంటాం.
చదువుకునేటప్పుడు స్నేహితులతో మాట్లాడుతూ, చదవకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం. తర్వాత మన స్నేహితులు అంతా స్థిర పడిపోయి, మనం మాత్రమే ఎలాంటి ఉద్యోగం లేకుండా, జీవితంలో స్థిరత్వం లేకుండాపోతామో అప్పుడు మనకు అనిపితుంది, అయ్యో అప్పటి కాలాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయానే అని, కానీ అప్పటీ కే సమయం మించి పోతుంది.
అందువల్ల నిరాశ, నిసృహలకు వెళ్తాం, అలా కాకుండా ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేస్తే మనం జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు, కొందరు ఎలా ఉంటారు అంటే తినాల్సిన సమయంలో పడుకోవడం, పడుకునే సమయంలో తినడం లాంటివి చేస్తుంటారు అదేనండి మన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు చేసేది అదేగా….
రాత్రి రెంటింటికి తిని పొద్దున్న పడుకుంటారు. ఇంకొందరు గప్పలు కొడుతూ పది మందిని చేర్చుకుని చుట్టూ ఊర్లోని మిగిలిన వారిపై పితురిలు చెప్తూ తమ సమయాన్నే కాకుండా మిగిలిన వారి సమయాన్ని వృధా చేస్తుంటారు, సమయం, యవ్వనం చాలా విలువైనవి, అవి పోతే తిరిగి రావు, బాల్యాన్ని కూడా తిరిగి తెచ్చుకోలేము, అందువల్ల సమయాన్ని వృధా చేయొద్దు అనేది మనం తెలుసుకోవాల్సిన నిజం. సమయం తక్కువ ఉండడం వల్ల తక్కువగా రాశాను :)
– భవ్య చారు