సమాజం మారాలి
“ఏంట్రా, డల్ గా ఉన్నావు?ఏమి జరిగింది” అన్నాడు గిరి తన మితృడు శశితో.”అసలు రోడ్డుపైకి రావాలంటేచాలా భయంగా ఉంది” అన్నాడు శశి.”ఏమైంది బ్రో. ఎందుకలాఅంటున్నావు?” అడిగాడుగిరి.
“ఒరేయ్,ఈ రోజు ఉదయంనేను బండిపై వెళ్ళేటప్పుడురెడ్ సిగ్నల్ పడింది. బండిఆపాను. వెనకనుంచి ఒకటే
హారన్లు. తలకాయ నెప్పివచ్చింది. గ్రీన్ సిగ్నల్వచ్చాక కూడా కొందరుపాదచారులు రోడ్డు దాటేస్తూకనపడతారు. సిగ్నల్ పడినావారు నడవటం ఆపరు. అలా
వాహనాలకు అడ్డంగా వచ్చేస్తూఉంటారు. అదెంత ప్రమదమోవారికి తెలియటం లేదు” అన్నాడు శశి.”అవును,ఆ విషయం నిజమే.పాదచారులు కూడా చాలా
బాధ్యతగా మసలుకోవాలి”అన్నాడు గిరి.”అంతే కాదు. కొందరు రాంగ్రూట్లో వచ్చేస్తుంటారు. చాలాఏక్సిడెంట్లు రాంగ్ రూట్లో వచ్చేవాహనాల వల్లే జరుగుతాయి”అన్నాడు శశి.
“అవును నిజమే. ఈ విషయం గురించి వాహనదారులకు చాలా అవగాహన కలిగించాలి”అన్నాడు గిరి.”అంతే కాదు బ్రో కొందరు అతివేగంగా వాహనాలపై వెళుతూఉంటారు. అలా వెళ్ళేటప్పుడువారితో పాటు పక్కనున్నవాహనదారులకు చాలాఇబ్బంది కలుగుతుంది. ప్రమాదాలు జరుగుతాయి”అన్నాడు శశి.
“తాగి వాహనాలు నడపటం.సెల్ఫోన్ మాట్లాడుతూ బండినడపటం చేసే వారిని కఠినంగాశిక్షించాలి.భారీగా జరిమానావిధించాలి”అన్నాడు గిరి.”ఎన్ని చట్టాలు ఉన్నా,ఎంతజరిమానా విధించినా కూడాప్రజలలో అవగాహన పెరిగేవరకు సమాజం మారదు”అన్నాడు శశి.”అవును శశి, ఈ విషయంలోప్రజలకు అవగాహన కలిగించిసమాజాన్ని మార్చేద్దాం” అన్నాడు గిరి.
-వెంకట భానుప్రసాద్ చలసాని