సమాజం కోసం
సమాజం కోసం పనిచేస్తున్న
వాళ్ళు మనచుట్టూ ఉన్నారు.
ఎవరికోసమైనా మనమెందుకు పనిచేయాలి? అని ఏమాత్రం అనుకోకుండా నిస్వార్ధ బుద్ధితో
సమాజం కోసం పనిచేస్తూనే
ఉంటారు వాళ్ళు. అలా చేస్తేనే
వారికి తృప్తి కలుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి గారు
సమాజంలోని ప్రజలకోసం
బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు
చేసారు. అలాగే బాలకృష్ణ
గారు బసవతారకం కాన్సర్
ఆసుపత్రిని జయప్రదంగా
నడుపుతూ రోగులకు చక్కటి
వైద్య సేవలు అందిస్తున్నారు.
అలాగే సాహిత్య రంగంలో
మన అక్షరలిపి తనదంటూ
ఒక ఒరవడిని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా
ముందుకు దూసుకుని పోతోంది. ఆ సమూహంలో
మనమూ ఉన్నందుకు గర్వపడాలి. సమాజం
కోసం మంచి-మంచి
కధలు,కవితలు అందించే
బాధ్యత తీసుకుని ఎంతో
శ్రమకోర్చి పనిచేస్తున్నారు
అక్షరలిపి టీం. వారి కృషి
ఫలించి వారికి మంచి పేరు, డబ్బు రావాలని మనందరం
కోరుకుందాం.
-వెంకట భానుప్రసాద్ చలసాని