సమాధానమవగలవా
జగతికి దీపమై తను వెలుగుతుంటాడు
ఇంటికి దీపమై నువ్వున్నావా
వెన్నెల దీపమై చందరయ్య ఉంటాడు సరే
ఇంటికి ఆహ్లదమై నువ్వున్నావా
వీచే గాలి పరిమళమై తాకుతుందంటావు
పరిమళమై కుటుంబాన్ని హత్తుకున్నావా
జీవజాలానికి నీరే ఆధారమంటావు
నీ ఇంటికి నువ్వాధారమై ఉన్నావా
ప్రశ్నలు వేస్తున్నానని విసుక్కోకు
నీకు నువ్వే సమాధానం.. నాది మాత్రం అనుసంధానమే
– సి.యస్.రాంబాబు
చాలా బాగుందండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌