సైనికుడు
గుండెల్లో ధైర్యాన్ని నింపుకుని,
మనసులో దేశభక్తి ఉంచుకుని,
తుపాకీ చేతపట్టుకుని భారత
సరిహద్దులకు రక్షణగా నిలిచే
సైనికుడా నీకు ఇదే నా సలామ్.
నువ్వు భారత దేశం కోసం
కుటుంబాన్ని వదిలి వెళ్ళావు.
నీ మితృలను వదిలి వెళ్ళావు.
చివరకు ప్రాణాన్నే వదిలావు.
త్యాగానికి మారుపేరు నువ్వే.
దేశానికి అభయహస్తం నీవే.
సరిహద్దులకు రక్షణగా నిలిచే
సైనికుడా నీకు ఇదే నా సలామ్.
దేశభక్తి ఉన్న నీకంటే
గొప్పవారు లేనే లేరు.
ప్రాణాలను దేశానికి
అర్పించే ఓ సైనికుడా
నీకు ఇవే శతకోటి వందనాలు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
దేశాన్ని కాపాడే సైనికులకు నా శతకోటి వందనాలు.