సైనికుడు
సైనికుడా!…
మండే ఎండకు
కరిగే మంచుకు
చీల్చే తూటాకు
ఎదురేనా నీ పయనం…
అడుగడుగునా సుడిగుండం
అవనికై సాగు పోరాటం
అమ్మేగా ఈ భారతం
ఆప్తులే ఈ జనమంతా….
ఏ పొగడ్త సాటి నీకు
ఏ గౌరవం సరి తూగదు నీకు
ఎగిరే పతాకమే నీ పొగరు
పొంగే లావా నీ నెత్తురు…..
ఆకలితో అలమటించినా
గాయాలతో బరువనిపించినా
శ్వాసే అలసిపోయినా
వెనుదిరగని బాణం నువ్వు….
– హనుమంత