సైనికుడు
దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్దపడి, దేశం పై ఉన్న అభిమానంతో దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనుకుని, తమ సుఖాలు, సంతోషాలు అన్ని మరిచిపోయి, కుటుంబాన్ని, కోరికలను కూడా వదిలేసి, దేశ సేవనే తమ లక్ష్యంగా, దేశ సేవనే తమ ఆశయంగా చేసుకుని, ఎన్నో కష్ట నష్టాలను భరించి, కఠినమైన శిక్షణను పూర్తిచేసుకుని భరతమాతకు సేవ చేస్తూ భారత దేశాన్ని కాపాడడానికి తమని తాము త్యాగం చేసుకుంటూ, దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కాపలా కాస్తున్న సైనికుల వల్లనే మనం ఈ రోజు నిశ్చింతగా నిద్ర పోగలుగుతున్నాము.
అలాంటి సైనికులకు మనం ఏం ఇవ్వగలం, ఎలా ఋణం తీర్చుకోగలం, తల్లి ఋణం ఎలా తీర్చుకోలేమో అలాగే సైనికుల ఋణం కూడా తీర్చుకోలేము. కాని మనం వారి పట్ల అభిమానం చూపించగలం, ప్రేమ, ఆప్యాయత పంచగలం.
మన కృతజ్ఞ్యతలను కాసిన్ని అక్షరాలుగా మార్చి, దేశ సేవలో నిమగ్నమైన వారికి అక్షర నీరాజనాలు పలుకుదాం. అక్షరాలతో నమస్సుమాంజలులు అర్పిద్దాం…
💂సైనిక దినోత్సవ శుభాకాంక్షలు 💂