సాయిచరితము-198
పల్లవి
సంసారనౌకను కాపాడవయ్యా
ఆపదల అలలను ఆపేయవయ్యా
నీ సేవలోనే తరియించుతాము
తరలిరావయ్యా సాయిమహారాజా
చరణం
అండగా నీవుంటే ఎదురేది మాకు
సాయి నామమొకటే కాపాడు మమ్ము
మా కలలను తీర్చేటి సద్గురువే నీవు
మా సంపద నీవు నీ సన్నిధి మాది
చరణం
కష్టాలు వస్తాయి.. నష్టాలు తెస్తాయి
నవ్వుతూ సాగెదము మా నీడ నీవనుచు
నీ మార్గములోనే నడిచేము మేము
ఇహము పరమూ సాయే అనుచు
చరణం
జీవితాన్ని తెలిపి.. సత్యాలను బోధించి
కాలాన్ని దాటే చిట్కాలు తెలిపి
ధన్యులను చేసితివి సాయి మహాదేవా
అతి క్లిష్టమైన ఈ జన్మయందు
సాధించు కార్యాలు ఎన్నో కలవనుచు
కొలువైతివయ్యా దేవాధిదేవా
– సి.యస్.రాంబాబు
బాగుంది🙏🙏🙏🙏🙏👌👌👌💐💐