సాయిచరితము
పల్లవి
అలసిన మనసుకు
ఆశవు నీవే సాయి
వెలిసిన బతుకుకు
శ్వాసవు నీవే సాయి
చరణం
నీడవు నీవని నమ్మితిమయ్యా
తోడువు నీవని తలచితిమయ్యా
పదమే కడుతూ ప్రార్థన చేసి
వేడితిమయ్యా సాయి..వెతలే తీర్చవ సాయి
చరణం
నీవే తప్ప దైవము కలదా
నీ ధ్యానమునే చేసిన చాలును
దిగులు గుబులు మాయము కావా
నీ దీవెనయే రక్షణమాకు సాయి
చరణం
ఊపిరి నీవే ఊహవు నీవే
ఊయలలూపే శక్తివి నీవే
కారడివందున జీవితమున్నది
కాపాడేందుకు కదలిరావయా సాయి
చరణం
నిర్మలరూపుడు సాయినాధుడు
ఆతని చరితము మనకు వేదము
నిత్యము మనము పఠనము చేసిన
మనమునకెంతో శాంతము కలుగును భాయీ
– సి.యస్.రాంబాబు