సాయిచరితము
పల్లవి :
బాసట నిలిచి
ధైర్యమునిచ్చి
వెంటే ఉండుము సాయి నీవు
వేదన తీర్చి
మార్గము చూపి మాతో ఉండుము సాయి నీవు
చరణం :
బాధలు మాకు ఎన్నిఉన్నను
నిను తలచినచో చాలు కదయ్య
ఎందరెందరో నిను కొలిచెదరు
అందరినీ నువు కాపాడెదవు
చరణం ;
పగలు రేయి మా తలపులలో
నీవుండినచో ఎంతదృష్టము
నిను చూడాలని మనసే తలచేను
ఆ భాగ్యము మాకివ్వుము సాయి
చరణం :
కులమత భేదములొద్దంటావు
అన్ని జీవులు ఒకటే యనుచు
ఎన్నిమారులు సూచిస్తావు
మాలో మార్పు రాదేమయ్యా
చరణం :
తాత్కాలికమే ఈ దేహముగా
నిను తలచుటయే మా మార్గముగా
ఇది తెలుసుటయే మా గమ్యముగా
శరణుకోరెదము కాపాడుముగా
-సి.యస్.రాంబాబు