సాయి చరితము
పల్లవి
దారి మరిచేమయ్య సాయి
మాకేమో బాటనే చూపమంటాము
నీ సన్నిధే చాలు మాకు
అది మాకు వేయి వరహాలయ్య సాయి
చరణం
వరమొకొకటి మాకియ్యవయ్యా
నిన్నెపుడు వదలకుండా చూడవయ్యా
సాయి నామము వీడకుండా
మదిలోన కొలువు తీరవ సాయి నీవు
చరణం
శాంతి దాతవు సాయి నీవు
ముక్తి బాటను చూపవయ్యా
ఈతిబాధలు మావి తీర్చి
మా అండ నీవున్నచో మాకు చాలు
చరణం
లోకమంతా చీకటైనా
వెలుగునిచ్చే వాడు ఒకడే
బాధలన్నీ తీర్చువాడు
సాయి బతుకుబాటే చూపుతాడు
చరణం
ఒక అడుగు వేసితే చాలు
మనవైపు పదిఅడుగులే వేయుతాను
ఓపికే ఉంటేను మనకు
సాయి తత్వము తెలియునోయీ
– సి.యస్.రాంబాబు