సాయి చరితము
పల్లవి
మే నమ్మే సత్యము నీవుగా
మే వెతికే దైవము నీవుగా
మా బరువు బాధ్యత నీదిగా
నువు లేని బతుకే శూన్యము
చరణం
నీ తలపే మాకు రక్షణ
నీ చరితము మాకు భిక్షగ
అది చదివిన మనసుకు శాంతిగా
లేదింక మాకే భ్రాంతిగా
చరణం
నీ తలపులు మాకు వెలుగుగా
ముసిరిన చీకటి తొలుగుగా
నీ పలుకే చిలుకును అమృతం
అది ఎదలో కురియు సుభాషితం
చరణం
ఆశ నిరాశల ఊయలై
భయపెడుతున్నది ఈ జీవితం
నీ నామము ఒకటే శాశ్వతం
నీ ధ్యానము ఒకటే మా హితం
చరణం
నమ్మకమొకటే మిగలగ
విశ్వాసముతోటి సాగుదాం
సాయినాధుడే నీడగా
భయచింతనయే వీడుదాం
– సి.యస్.రాంబాబు