సాయిచరితము -191
పల్లవి
పాటలా సద్గురువు
ప్రాణమై నిలుచునుగా
పూలతోటలా సద్గురువు
పరిమళమే పంచునుగా
చరణం
బంధాల మాయలు
కమ్మేయు వేళ
బాధ్యతల బరువేమో
ముంచేయు వేళ
గురువొక్కడే నిన్ను కాపాడునయ్యా
సద్గురువును నీవు ఎన్నడూ మరువకు/మరువకుమా
మాటిచ్చి నిలబడదాం మహిలోన మనము
చరణం
గురు ధ్యానముతోటి చింతలన్నీ తీరునుగా
సద్గురు నామముతో వెలుగే నిండునుగా
సద్గురు తలపులతో వేదనలే పోవునుగా
కలలన్నీ చెంతచేర బతుకే ఇక పండునుగా
చరణం
మనమేమో తాత్కాలికం
గురువేమో శాశ్వతం
ఇది మరువక మనము తన నీడన సాగుదాం
తనువు మనసు తనకే
అంకితమే చేయుదము
-సి.యస్.రాంబాబు
చాలా చక్కగా వ్రాసారు.