సాయి చరితము-189
పల్లవి
ప్రాణము నీవే సాయి
గానము నీవే
పలుకు నీవే సాయి
పదమూ నీవే
చరణం
ఆపదలొస్తే నీకై చూసితిమి
ఆకలి వేస్తే నిన్నే అడిగితిమి
అలసట వస్తే నిన్నే తలిచితిమి
నీ ధ్యానముతో ఊరట పొందితిమి
చరణం
బతుకు బాటలో నిన్నే వెతికితిమి
నీ చరితముతో బతుకే తెలిసేనుగా
బంధాలన్నీ నిన్నే చూపేనుగా
బాధ్యతలన్నీ నీవే అంటాము
చరణం
కాలచక్రమే కదిలేపోవును
సాయి ఒక్కడే నిలిచే ఉండును
పగలు రేయిలో తననే తలచెదము
నిన్న రేపుకు వారధి సాయేగా
చరణం
కలల మాటున కాంతివి నీవే
కలిమిలేముల సాక్షివి నీవే
నీ నీడలో పెరిగిన మేము
భయమును మరిచి ప్రేమను పంచితిమి
-సి.యస్.రాంబాబు