సాయి చరితము-188
పల్లవి
దేహము నీదే సాయి
ఆదేశము నీయవ సాయి
సందేశము నీవే సాయి
సందేహము లేదు సాయి
చరణం
కాలపరీక్షకు నిలిచి
నీ పేరును మేము తలచి
సాగిపోయెదము సాయి
కలతలు నలతలు తోటి
సహజీవనమే చేసే
ధైర్యము మాకు ఇచ్చి
అభయము నొసగిన నిన్ను
ఎంతని వేడుకొనెదము
చరణం
ఒంటరి పయనములోన
వెంటే ఉండమనుచు
ప్రార్థనలే చేసితిమి
నీపేరొకటే చాలును
భవసాగరములు దాటి
భవ్య తీరములు చేరి
నవ్య పథమునే సాగెదము
బతుకు తీరునే మార్చే
ఆశల పల్లకి నీవు
ఆనందానికి అర్థం
సంతోషానికి మార్గం
చూపిన నీకు వందనమూ
చరణం
ఆపదలే ఎదురైతే
పదమే కట్టుతాము
కష్టాలెన్ని వచ్చినా
నీ నామము వీడము సాయి
నీ బోధల తోటి మేము
మాతీరును మార్చుకొనుచు
మానవాళి అభ్యున్నతికి
కృషి చేస్తాము సాయి
మా వెంటే ఉండి నీవు
ఆ బాటను చూపవ సాయి
-సి.యస్.రాంబాబు