సాయిచరితము-183
పల్లవి
నీ పదమే మా శరణము
నీ చూపే మా ప్రాణము
నీ తలపే మా స్వర్గము
సాయిమహాదేవా.. సాయిమహాదేవా..
చరణం
ఆపదలు ఎన్నున్నా
నిన్ను తలచుతామయ్యా
కష్టాలు ఎదురైతే
నీకు మొక్కుతామయ్యా
షిరిడీలో ఉన్ననేమి
మా గుండెన ఉంటావు
మా కంటిపాపవై
మార్గమునే చూపుతావు
చరణం
నీ నీడన మేముంటే
జన్మ ధన్యమేనయ్యా
మా అందరి గురువువై
జ్ఞాన బోధ చేస్తావు
నీ చరితను చదివితిమా
బతుకు విలువ తెలియునుగా
కష్టసుఖాలన్నింటా
వెంట నీవు ఉండవయా
-సి.యస్.రాంబాబు
చక్కగా వ్రాసారు ఈ భక్తి గీతాన్ని.