సాయి చరితము
పల్లవి
నీ సేవయే మా భాగ్యము
నీ చరితము మాకు అండ
నిను కొలిచే భాగ్యము నిరతమూ ఇయ్యవయ్య
లోకాలను గెలిచేటి శక్తివయ్య నీవు
పాపాలను కడిగేటి భుక్తినివ్వు మాకు
చరణం
సకల జీవులందు ప్రేమ పంచుతావు
ప్రేమతో మాకేమో దారిచూపుతావు
అల్పులమూ మేమయ్యా మన్నించు సాయి
నీ బాట నడవలేని లేమి బాధనున్నాము
చరణం
గురువుబాట మరచినచో
బాగుపడడు ఎవ్వడు
ఈ సత్యము తెలుపుటకు
లీలలెన్నో చూపితివి
మాన్యుడు సామాన్యుడు
అన్న భేదమసలె లేదు
అందరొకటె దైవానికి అన్నమాట నీదయ్యా
చరణం
ఆపదలో మేముంటే తోడు మాకు నీవయ్యా
నీ నామస్మరణతో కలతలన్ని తీరిపోవు
దేహచింత వదిలి మేము
దైవబాట సాగేందుకు
ధైర్యమివ్వు సాయి
మావెంటవుండవోయి
– సి. యస్. రాంబాబు