సగటు జీవి
కొనడానికి చెప్పులు లేక ,
ఎండలో తిరుగుతూ ,
ఇంటింటికి వెళ్లి , వారి ,
తలుపును తడుతూ ,
కొందరు మొఖం మీద ,
ఇంకొందరు నోటి మీద ,
మరి కొందరు బండ బూతులు తిడుతుంటే ,
వాటన్నింటినీ చిరు నవ్వుతో భరిస్తూ ,
పెరిగిన బస్ ఛార్జీ లను తట్టుకుంటూ ,
చిల్లర ఇవ్వని కండక్టర్ ని తిట్టుకుంటూ ,
ఎక్కిన బస్ ఎక్కుతూ ,
దిగిన బస్ దిగుతూ ,
ఎక్కిన గడప, దిగే గడప ,
ఎక్కుతూ, దిగుతూ ,
పెరిగిన ధరలతో ,
బతకడం చేతకాని ,
మధ్య తరగతి , సగటు జీవి ,
మార్కెటింగ్ లో ఎదురు దెబ్బలు తింటూ ,
తినడానికి సమయం కూడా లేక,
అవసరాలు తీరక , అప్పు చేసే ధైర్యం లేక ,
ఉన్నతంగా బతక లేక ,
మధ్యతరగతి బతుకు బతక లేక ,
నింగికి నెలకి మధ్యలో ,
ఊగిసలాడుతూ, డబ్బున్న వారిని ,
అసూయ తో చూస్తూ , వారితో పోల్చుకుంటూ ,
నలిగి పోతున్నా సగటు, మధ్యతరగతి జీవి ,
నీ ఆశలు తీరే మార్గం ఏదీ .., ?
– అర్చన